మెగాస్టార్ చిరంజీవి నటించే 150వ చిత్రం ఆయన పుట్టినరోజు కానుకగా ఆగష్టు 22న లాంఛనంగా ప్రారంభమై, సెప్టెంబర్ నుండి సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని కంటిన్యూగా ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేయడానికి దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక పూరీ సంగతి వేరేగా చెప్పనవసరంలేదు. సినిమాలను స్పీడ్‌గా తీయడంలో ఆయన బహునేర్పరి. కాబట్టి చిరు చిత్రాన్ని కూడా ఆయన అంతే ఫాస్ట్‌గా అనుకున్న సమయానికి పూర్తి చేసి సంక్రాంతికి విడుదలకు రెడీ చేస్తాడనే నమ్మకం వ్యక్తమవుతోంది. కాగా తమ్ముడు పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించనున్న ‘గబ్బర్‌సింగ్2’ చిత్రం కూడా పక్కా స్క్రిప్ట్‌తో రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని కూడా నాన్‌స్టాప్‌గా షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతి బరిలోనే దింపనున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. సో.. వచ్చే సంక్రాంతికి మెగాబ్రదర్స్ సినిమాల మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్ వర్గాలు భావిస్తున్నాయి.