ఇప్పటివరకు టాలీవుడ్‌కు 100కోట్ల సినిమా అనేది సాధ్యం కాలేదు. పవన్‌కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం దానికి దగ్గరగా వచ్చి ఆగిపోయింది. కాగా ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘బాహుబలి’, పవన్‌కళ్యాణ్ నటించనున్న ‘గబ్బర్‌సింగ్2’, మహేష్‌బాబు నటిస్తున్న ‘శ్రీమంతుడు’, గుణశేఖర్ 'రుద్రమదేవి' చిత్రాలు ఈ క్లబ్‌లో మొదటిసారిగా బోణీ కొట్టాలని ఎదురుచూస్తున్నాయి. ఇప్పుడు దీనికి తోడు మరలా చిరంజీవి నటించే 150వ చిత్రం అనౌన్స్ అయిన నేపథ్యంలో ఈ చిత్రం కూడా 100కోట్ల క్లబ్‌లో ఖచ్చితంగా చేరేది మొదట తమ సినిమానే అని చిరు అభిమానులు కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. మొత్తానికి వచ్చే ఏడాది అదే సమయానికి టాలీవుడ్‌లో మొదటి 100కోట్ల చిత్రం నమోదవుతుందనే ఆశతో ఉన్నారు.