Advertisementt

రామ్‌చరణ్‌ రాడంటూ సంబరపడుతున్నారు!

Thu 14th May 2015 04:28 AM
ram charan,srinuvaitla,danayya,mai name is raju movie   రామ్‌చరణ్‌ రాడంటూ సంబరపడుతున్నారు!
రామ్‌చరణ్‌ రాడంటూ సంబరపడుతున్నారు!
Advertisement
Ads by CJ

సంక్రాంతి బరిలోకి దిగి కలెక్షన్లు కుమ్మేయడం రామ్‌చరణ్‌కు బాగా అలవాటైపోయింది. కానీ 2016 సంక్రాంతికి మాత్రం చరణ్‌ రాడని భరోసా ఇస్తున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ప్రస్తుతం రామ్‌చరణ్‌ శ్రీనువైట్ల దర్శకత్వంలో దానయ్య నిర్మాతగా ఓ చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి ‘మై నేమ్‌ ఈజ్‌ రాజు’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. ఈ చిత్రాన్ని ఆయన దసరాకు టార్గెట్‌ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన సురేంద్రరెడ్డి దర్శకత్వంలో చేయబోయే చిత్రం ప్రారంభం కానుంది. దాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌కు రెడీ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. వాస్తవానికి శ్రీనువైట్ల చిత్రం పూర్తయ్యే సమయానికి రామ్‌చరణ్‌ తన తండ్రి చిరంజీవి చిత్రం నిర్మించే పనిలో బిజీ అయిపోతాడు. దీంతో సంక్రాంతికి రామ్‌చరణ్‌ రావడం లేదనే సంతోషం ఇతర హీరోల్లో కనిపిస్తోంది అంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ