పూరిజగన్నాథ్ దర్శకత్వంలో చిరంజీవి 150వ చిత్రానికి అధికారిక ప్రకటన వెలువడింది. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు ఊరట దొరికింది. ఇక ఈ సినిమా విజయాన్ని అటు పూరితోపాటు ఇటు రామ్‌చరణ్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చిరంజీవి 150వ సినిమా ఇండస్ట్రీ బ్లాక్‌బాస్టర్‌గా నిలపాలని వారిద్దరూ పట్టుదలతో ఉన్నారు. ఇక చిరంజీవి 150వ సినిమా దర్శకుడు తేలడంతో ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై చర్చలు ఊపందుకున్నాయి. సీనియర్ కథానాయిక మొదలు యంగ్ హీరోయిన్స్ వరకు అందరి పేర్లు తెరమీదకు వస్తున్నాయి.
ప్రస్తుతం నటిస్తున్న హీరోయిన్స్ అందరిలోకి చిరంజీవి సరసన నటించే అవకాశం నయనతారకే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీనియర్ హీరోయిన్ కావడంతోపాటు బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, రజినీకాంత్‌ల పక్కన హీరోయిన్‌గా నటించిన నయనతార అయితే చిరంజీవికి కరెక్టుగా సరిపోతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. మొదట బాలీవుడ ్‌హీరోయిన్‌ని చిరంజీవి పక్కన నటింపజేయాలని చిత్రయూనిట్ ఆలోచించినప్పటికీ చివరకు నయనతారకే ఓటేసినట్లు కనబడుతోంది. ఈ విషయంలో కూడా త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.