Advertisementt

త్రిష పెళ్లి ఎందుకు రద్దయ్యిందంటే..!!

Wed 13th May 2015 05:38 AM
trisha,marriage,engagement,cancelled  త్రిష పెళ్లి ఎందుకు రద్దయ్యిందంటే..!!
త్రిష పెళ్లి ఎందుకు రద్దయ్యిందంటే..!!
Advertisement
Ads by CJ

త్రిష కెరియర్‌ మళ్లీ ఊపందుకుంది. పెళ్లి  క్యాన్సిల్‌ చేసుకున్న తర్వాత ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చిపడుతున్నాయి. తమిళ నిర్మాత వరుణ్‌మణియన్‌తో పెళ్లికి సిద్ధమవుతున్న వేళ రెండు కుటుంబాల మధ్య విభేదాలు రావడంతో వీరి వివాహం ఎంగేజ్‌మెంట్‌తోనే పెటాకులయ్యింది. అయితే వీరి వివాహం ఎందుకు రద్దయ్యిందన్న విషయం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఎంగేజ్‌మెంట్‌ తర్వాత పెళ్లి రద్దు చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందనేది ఎవరికీ అంతుచిక్కకుండా ఉండింది. అయితే ఎట్టకేలకు దీనికి సంబంధించిన కొంత సమాచారం ఇప్పుడు కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.

త్రిష సన్నిహిత వర్గాల కథనం మేరకు.. వివాహం తర్వాత సినిమాల్లో నటించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని వరుణ్‌మణియన్‌ కుటుంబ సభ్యులు త్రిషకు తేల్చిచెప్పారట. దీనికి ససేమిరా అన్న త్రిష.. తాను గత పదేళ్లుగా నటిస్తున్నానని, మంచి ఆఫర్‌ వస్తే సినిమాల్లో నటిస్తానని చెప్పిందట. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న వరుణ్‌ కుటుంబ పెద్దలు పెళ్లి క్యాన్సిల్‌ చేసుకుంటామని హెచ్చరించినా.. త్రిష వెనక్కి తగ్గకపోవడంతో ఆ పెళ్లి ఆగిపోయింది. ఇక తాను ఒంటరిగానే ఉన్నానని, ఈ జీవితం చాలా సంతోషంగా సాగిపోతుందని త్రిష ట్విట్టర్‌లో స్టేట్‌మెంట్‌ఇచ్చింది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ