Advertisementt

క్యాన్సర్‌ బాధితురాలిని పరామర్శించిన జూ.ఎన్టీఆర్‌..!!

Wed 13th May 2015 04:34 AM
jr ntr,srinidhi,cancer,hosptial  క్యాన్సర్‌ బాధితురాలిని పరామర్శించిన జూ.ఎన్టీఆర్‌..!!
క్యాన్సర్‌ బాధితురాలిని పరామర్శించిన జూ.ఎన్టీఆర్‌..!!
Advertisement
Ads by CJ

క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ చిన్నారిని జూనియర్‌ ఎన్టీఆర్‌ పరామర్శించారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఉన్న రామ్‌దేవ్‌ ఆస్పత్రిలో శ్రీనిధి అనే చిన్నారి క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతోంది. అయితే తన అభిమాన హీరో ఎన్టీఆర్‌ను చూడాలని ఉందని ఆ చిన్నారి తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు విషయాన్ని ఎన్టీఆర్‌ కార్యాలయానికి చేరవేశారు. ఈ సమాచారం అందుకున్న ఎన్టీఆర్‌ వెంటనే ఆస్పత్రికి వెళ్లి చిన్నారిని పరామర్శించారు. అంతేకాకుండా శ్రీనిధికి చిన్న బహుమతి కూడా ఇచ్చిన ఎన్టీఆర్‌ ఆమె చికిత్సకు అయ్యే వ్యయాన్ని భరిస్తానని కూడా హామీనిచ్చారు.

 

గతంలో పవన్‌కల్యాణ్‌లు కూడా ప్రాణంతక వ్యాధులతో బాధపడుతున్న తమ అభిమానులను ఆస్పత్రికి వెళ్లి మరీ పరామర్శించారు. ఇక పవన్‌కల్యాణ్‌ తన చిన్నారి అభిమాని చికిత్సకు ఖర్చైన వ్యయాన్ని కూడా భరించారని సమాచారం. ఇక ఇప్పుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారిని పరామర్శించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. వారు ఈ పనులు ఎందుకు చేస్తున్నా.. ఇలాంటి చర్యలతో ఇండస్ట్రీలో మానవతా విలువలు పెరుగుతాయని సినీవర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ