రవితేజ సినిమా అంటే ఓ 20, 30కోట్లలోపు తీస్తే లాభాలొస్తాయని చెప్పవచ్చు. ఆయన మార్కెట్ రేంజ్ అది. ఇప్పటి వరకు రవితేజ కెరీర్‌లో ‘బలుపు’ మాత్రమే 40కోట్లకు దగ్గరగా వచ్చింది. అయితే ‘కిక్2’కి బడ్జెట్ ఏకంగా 40కోట్లు అని తెలుస్తోంది. మరి బడ్జెట్టే 40కోట్లు అంటే రవితేజ మొదటిసారిగా 50కోట్ల క్లబ్‌లో చేరితే గానీ నిర్మాత కళ్యాణ్‌రామ్‌కు, ఆ సినిమాను కొన్న బయ్యర్లకు లాభాలు వచ్చే అవకాశం లేదు. పోనీ ఈ చిత్రం కనీసం 40కోట్లు వసూలు చేస్తేనే ఈ చిత్రం సేఫ్ ప్రాజెక్ట్ అవుతుంది. మొత్తానికి ‘కిక్2’ డేంజర్ జోన్‌లోకి ఎంటర్ అయినట్లే కనిపిస్తోంది. మరి రవితేజపై నమ్మకంతో ఇంత బడ్జెట్ పెట్టించిన దర్శకుడు సురేందర్‌రెడ్డిది తప్పా..? లేక గుడ్డిగా అంత మొత్తం పెట్టుబడిపెట్టిన నిర్మాత కళ్యాణ్‌రామ్‌ది తప్పా? అనేది సమాధానం దొరకని ఓ ప్రశ్నగా మిగిలిపోవడం ఖాయం అని చెప్పవచ్చు.....!