Advertisementt

రవితేజకు తిక్కరేగింది!

Tue 12th May 2015 11:50 AM
raviteja,kick 2 movie,sampath nandi,bengal tiger,santhosh srinivas  రవితేజకు తిక్కరేగింది!
రవితేజకు తిక్కరేగింది!
Advertisement
Ads by CJ

నిజమే... మాస్‌మహారాజా రవితేజకు తిక్కరేగింది. రోజురోజుకీ రవితేజలో గ్లామర్‌ పెరుగుతోంది. ‘కిక్‌2’ చిత్రం ఆడియోలో ఎన్టీఆర్‌ చెప్పినట్లు... ఎన్టీఆర్‌ నిక్కర్లేసుకునే వయసు నుండి రవితేజ సినీ ఫీల్డ్‌లోనే ఉన్నాడు. ఈ మాట విని అందరూ రవితేజ వయసు ఇంతకీ ఎంత? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రవితేజ తన వయస్సును పక్కనపెట్టి కెరీర్‌ను యమాస్పీడ్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన ‘కిక్‌2’ విడుదలకు సిద్దమవుతోంది. సంపత్‌నందితో చేస్తున్న ‘బెంగాల్‌టైగర్‌’ స్పీడ్‌గా సాగుతోంది. తాజాగా రవితేజ మరో కొత్త సినిమాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం.

హీరో రామ్‌తో ‘కందిరీగ’ తీసి హిట్‌ కొట్టి, ఆ వెంటనే ఎన్టీఆర్‌కు ‘రభస’ వంటి సూపర్‌ఫ్లాప్‌ను ఇచ్చిన దర్శకుడు సంతోష్‌శ్రీనివాస్‌ దర్శకత్వంలో రవితేజ పనిచేయనున్నాడు. ‘రభస’ ఫ్లాప్‌ను మర్చిపోయేలా చేసే ఓ మాంచి మాస్‌మసాలా సబ్జెక్ట్‌ను తయారుచేసుకొన్న సంతోష్‌శ్రీనివాస్‌ తనతో మిగిలిన టాప్‌ హీరోలు ఎలాగూ సినిమా చేయరని డిసైడ్‌ అయిన తర్వాత ఆ సబ్జెక్ట్‌ను రవితేజకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేశాడని, ఈ చిత్రం కథ,కథనాలు రవితేజకు బాగా నచ్చడంతో ఆయన ఓకే చెప్పాడని తెలుస్తోంది. కాగా ఈ చిత్రానికి ‘తిక్కరేగింది’ అనే టైటిల్‌ను అనుకొంటున్నారని, రవితేజకు బాగా యాప్ట్‌ అయ్యే టైటిల్‌ ఇదని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు అంటున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ