Advertisementt

కొరటాల శివతో యంగ్‌టైగర్‌!

Tue 12th May 2015 04:08 AM
jr ntr,koratala siva,sukumar,maa nannaku prematho movie  కొరటాల శివతో యంగ్‌టైగర్‌!
కొరటాల శివతో యంగ్‌టైగర్‌!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో ‘మా నాన్నకు ప్రేమతో’ అనే రివేంజ్‌ స్టోరీ చేస్తున్నాడు. కాగా గతంలో ఆయన ‘మిర్చి’ సినిమా హిట్టయిన వెంటనే కొరటాల శివతో సినిమా చేస్తానని మాట ఇచ్చాడట. దీంతో సుకుమార్‌ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ చేయబోయేది ఖచ్చితంగా కొరటాల శివ సినిమానే అని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు అంటున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే ఎన్టీఆర్‌-కొరటాల శివ మధ్య స్టోరీ డిస్కషన్స్‌ కూడా జరిగాయని సమాచారం. ప్రస్తుతం కొరటాల శివ మహేష్‌బాబుతో ‘శ్రీమంతుడు’ (వర్కింగ్‌టైటిల్‌) చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదలైన వెంటనే ఎన్టీఆర్‌ సినిమా వర్క్‌లో కొరటాల మునిగిపోనున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని నిర్మిస్తున్న ‘మైత్రి మూవీస్‌’ బేనర్‌పైనే ఎన్టీఆర్‌ చిత్రం కూడా రూపొందనుంది. మరి కొరటాల శివ చేయబోయేది తమిళ ‘కత్తి’ రీమేకా? లేక స్ట్రెయిట్‌ స్టోరీనా అనేది తెలియాల్సివుంది....!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ