మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు శుభవార్త. ఆయన 150వ చిత్రానికి దర్శకునిగా పూరీజగన్నాథ్ ఎంపికయ్యాడు. చిరు ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కనున్న ఆయన చిత్రాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయగలిగేది పూరీజగన్నాథ్ మాత్రమే అని ఆయన అభిమానులు సైతం ముక్తకంఠంతో చెబుతున్నారు. అయితే చిరు పక్కన ఏ హీరోయిన్ నటిస్తుంది? అనేదే ఇప్పుడు అందరిలో మెదలుతున్న ప్రశ్న, గతంలో శ్రియ, త్రిష వంటివారు ఆయన పక్కన నటించినప్పుడే చాలా మంది ఆయనకు వారు జోడీగా సూట్ కాలేదని, మరీ ఆయన పక్కన చిన్న అమ్మాయిల్లా కనిపించారనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఈ విషయంలో పూరీ చాలా కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇలాంటి విద్యలు పూరీకి తెలిసినంతగా ఎవ్వరికీ తెలియవని చెప్పాలి. ప్రస్తుతానికి అయితే నయనతార బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తోంది. ఇక రెండో హీరోయిన్‌కు అవకాశం ఉంటే అది ఖచ్చితంగా చార్మి ఖాతాలోకే వెళ్లుతుందని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఇక బాలీవుడ్ భామలను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేసులో దీపికాపడుకోనే, కత్రినాకైఫ్ వంటివారు ఉండే అవకాశం ఉంది. మొత్తానికి లేట్‌గా అయినా సరే చిరు 150 వచిత్రం న్యూస్‌పై స్పష్టత రావడం మెగాభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. అన్నిచోట్లా ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.