ఈమధ్యకాలంలో అసలు ఐటం సాంగ్‌లు లేకుండా సినిమాలు ఉండటం లేదు. ఐటంసాంగ్‌ల కోసం ప్రత్యేకంగా హీరోయిన్లను తీసుకొని భారీగా ఖర్చు చేసి చిత్రీకరిస్తున్నారు. ఇండియన్ సినిమాల్లో ఐటంసాంగ్ అనేది ఒక కమర్షియల్ ఎలిమెంట్ అయిపోయింది. అయితే రానురాను కొన్ని సినిమాల్లో ఐటంసాంగ్‌లు శృతిమించుతున్నాయి. సెక్స్ కంటెంట్ సైతం ఇందులో జత చేస్తున్నారు. ఇందులో నటించే భామలు కూడా రెచ్చగొట్టే విధంగా నర్తించడం, అందాలు ఆరబోయడం వంటివి చేస్తున్నారు. ఈ ఐటం సాంగ్‌ల వల్లే రేప్‌లు జరుగుతున్నాయనే వాదన ఉంది. తాజాగా ఇదే విషయాన్ని ప్రముఖ సీనియర్ బాలీవుడ్ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఓంపురి స్పందించారు. ఇప్పటి సినిమాల్లోని ఐటం సాంగుల్లో వల్గారిటీ పెరిగిపోయింది. ఆ సాంగులు అత్యాచారాలను ప్రేరేపించే విధంగా ఉంటున్నాయి. సెక్స్‌లో క్లైమాక్స్ చేరినప్పుడు ఎలా ఉంటుందో ఇందులో నటించే నటీనటుల ఎక్స్‌ప్రెషన్స్ అలా ఉంటున్నాయి. సెక్స్ ఫ్రస్టేషన్ ఉన్నవారు ఇలాంటి అసభ్యకర సాంగులు చూడటానికి ఇష్టపడుతున్నారు. ఆ సాంగుల సీడీలను ఇబ్బడిముబ్బడిగా కొంటున్నారు.. అంటూ వ్యాఖ్యానించాడు.