Advertisementt

కొడుకు కంటే లారెన్స్‌నే ఎక్కువగా నమ్మాడు!

Sun 10th May 2015 03:14 PM
patas tamil remake,jeeva,lawrence raghava,rb chowdary,kalyanram  కొడుకు కంటే లారెన్స్‌నే ఎక్కువగా నమ్మాడు!
కొడుకు కంటే లారెన్స్‌నే ఎక్కువగా నమ్మాడు!
Advertisement
Ads by CJ

నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మాతగా, హీరోగా నటించిన ‘పటాస్‌’ చిత్రం తెలుగులో ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం తమిళ రీమేక్‌ రైట్స్‌ను సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్‌ సంస్థ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ చిత్రాన్ని తన కొడుకు జీవాతో తీయాలని ఆర్‌.బి.చౌదరి భావించాడు. అయితే ‘గంగ’ చిత్రం సాధిస్తోన్న విజయం నేపథ్యంలో ఈ చిత్రాన్ని జీవాతో కాకుండా లారెన్స్‌తో చేస్తున్నాడట.

మరి ఈ చిత్రానికి డైరెక్షన్‌ కూడా లారెన్సే చేస్తాడా? లేక వేరే వారి దర్శకత్వంలో లారెన్స్‌ నటిస్తాడా? అనేది తేలాల్సివుంది. ఈ చిత్రం రీమేక్‌ రైట్స్‌ను చౌదరి 63లక్షలు వెచ్చించి సొంతం చేసుకున్నాడు. అలాగే ఈ చిత్రం శాటిలైట్‌ రైట్స్‌ను జీతెలుగు చానెల్‌ 4కోట్ల 30లక్షలకు సొంతం చేసుకుంది. అలాగే ఈ చిత్రం కన్నడ రీమేక్‌ రైట్స్‌ కూడా ఫ్యాన్సీ ధరకు అమ్ముడయ్యాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ