ఒక్కసినిమా వారి జీవితాలను మార్చేసింది. తమ మొదటి చిత్రంతో విజయ్‌కుమార్ కొండా, సుధీర్‌వర్మలు ఓవర్‌నైట్ స్టార్స్ అయిపోయారు. దీంతో వారి రెండో సినిమా షూటింగ్‌లో ఉండగానే పలువురు స్టార్‌హీరోలు వారికి తాము వారి కాంబినేషన్‌లో సినిమా చేస్తామని మాట ఇచ్చారు. కానీ ‘గుండెజారి గల్లంతయిందే’ తర్వాత విజయ్‌కుమార్ కొండా దర్శకత్వం వహించిన ‘ఒక లైలా కోసం’ ఫ్లాప్ అయింది. దాంతో విజయ్‌కి మాటిచ్చిన హీరోలు తప్పించుకు తిరిగారు.
ఇక సుధీర్‌వర్మ విషయానికి వస్తే ఆయన తీసిన ‘స్వామిరారా’ చిత్రం అనూహ్యవిజయం సాధించింది. దీంతో అతనితో సినిమా చేస్తామని రవితేజతో పాటు పలువురు మాట ఇచ్చారు. కానీ ఆయన సెకండ్ మూవీ ‘దోచెయ్’ ఫ్లాప్ కావడంతో రవితేజతో సహా ఏ హీరో కూడా ఆయనకు డేట్స్ ఇవ్వకుండా మొహం చాటేస్తున్నారు. ఇదే కోవలో సెకండ్ మూవీ ఎఫెక్ట్ తగిలిన దర్శకులు ఎందరో ఉన్నారు.
మరి ‘కార్తికేయ’ తీసిన చందుమొండేటి త్వరలో నాగచైతన్యతో ఓ సినిమా చేయనున్నాడు. మరి ఆయన కూడా సెకండ్ మూవీ ఎఫెక్ట్‌కు బలవుతాడా? సేఫ్‌గా బయటపడతాడా?అనేది అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది....!