అల్లుఅర్జున్, ఆయన తండ్రి అల్లు అరవింద్‌లు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. తమ చిత్రాల్లో వేస్టేజీకి చోటు లేకుండా చూసుకొంటూ ఉంటారు. అదే గీతాఆర్ట్స్ బేనర్‌కు పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. కాగా అల్లుఅర్జున్ త్వరలో గీతాఆర్ట్స్ పతాకంపై బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం బడ్జెట్ విషయంలో నిర్మాత అల్లుఅరవింద్‌తో పాటు బన్నీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ‘రేసుగుర్రం’ చిత్రంతో బన్నీ 50కోట్ల క్లబ్బులో స్థానం సంపాదించాడు. తర్వాత వచ్చి తాజా చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రం కూడా 50కోట్లకు చేరువలో ఉంది. అయితే అల్లుఅర్జున్, త్రివిక్రమ్‌ల సినిమా కాబట్టి నిర్మాత రాధాకృష్ణ తొందరపడి సరైన అవగాహన లేకుండా భారీగా బడ్జెట్ ఖర్చుపెట్టదంతో ఎవ్వరికీ లాభాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే తమ సొంత సినిమా విషయంలో బన్నీతో పాటు అల్లుఅరవింద్ బోయపాటి శ్రీనుకు బడ్జెట్ పాఠాలు చెబుతున్నారట.
బడ్జెట్ కంట్రోల్‌కు సంబంధించిన ప్రతి విషయాన్ని బోయపాటికి వివరంగా చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ బడ్జెట్ 40కోట్లు దాటడానికి వీలులేదని ఖరాఖండీగా చెప్పారట. ఇటీవలికాలంలో కాస్ట్‌ఫెయిల్యూర్స్ ఎక్కువవుతున్నాయి. ‘గోవిందుడు అందరివాడేలే, టెంపర్, సన్నాఫ్ సత్యమూర్తి’ తరహాలో ఈ చిత్రం కాస్ట్ ఫెయిల్యూర్ కాకుండా ముందే జాగ్రత్తలు తీసుకుంటున్నారట....!