Advertisementt

గోపీచంద్‌ ఇంట్రెస్ట్ పెట్టడం లేదంట!

Sun 10th May 2015 11:35 AM
loukyam,jil,gopichand,jaganmohan ips,nayanthara,gopichand new movie,b gopal  గోపీచంద్‌ ఇంట్రెస్ట్ పెట్టడం లేదంట!
గోపీచంద్‌ ఇంట్రెస్ట్ పెట్టడం లేదంట!
Advertisement
Ads by CJ

‘లౌక్యం, జిల్‌’ వంటి చిత్రాల కంటే ముందే గోపీచంద్‌ హీరోగా, నయనతార హీరోయిన్‌గా ఓ తమిళ దర్శకుడి డైరెక్షన్‌లో ఓ చిత్రం ప్రారంభంమైంది. ఆ తర్వాత ఆ డైరెక్టర్‌ను మార్చి బి.గోపాల్‌కు దర్శకత్వ బాధ్యతలను అప్పగించారు. కాగా ఈ చిత్రంలో గోపీచంద్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఒకేసారి తెలుగుతోపాటు తమిళంలో కూడా నిర్మితమవుతోన్న ఈ చిత్రం ‘లౌక్యం, జిల్‌’ల కారణంగా ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. ఎందుకనో ఈ ప్రాజెక్ట్‌ విషయంలో గోపీచంద్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. కాగా ఈ చిత్రానికి మొదట్లో ‘జగన్మోహన్‌ ఐ.పి.యస్‌.’ అనే టైటిల్‌ను అనుకున్నారు.

కానీ ఈ చిత్రానికి టైటిల్‌తో పాటు సినిమాలోని చాలా బాగాన్ని రీషూట్‌ చేస్తున్నారని, కేవలం యాక్షన్‌ ఓరియంటెండ్‌ చిత్రంగా కాకుండా ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా ఉండేలా గోపీచంద్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. కాగా ఈ చిత్రం షూటింగ్‌ ఇప్పుడు మరలా వేగం పుంజుకుందని, ఈ చిత్రాన్ని జులై లేదా ఆగష్టులో విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకులను ఏవిధంగా అలరిస్తోందో చూడాలి...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ