Advertisementt

ఈ హీరో ఆశలన్నీ ఆ చిత్రంపైనే!

Sat 09th May 2015 06:23 PM
naga sourya,jadoogadu,sonarika,chinthakayala ravi,yogesh  ఈ హీరో ఆశలన్నీ ఆ చిత్రంపైనే!
ఈ హీరో ఆశలన్నీ ఆ చిత్రంపైనే!
Advertisement
Ads by CJ

కెరీర్‌ ప్రారంభం నుండి వరుసగా రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్స్‌ సినిమాల్లో మాత్రమే కనిపించిన హీరో నాగశౌర్య తొలిసారిగా అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా చేసిన చిత్రం ‘జాదూగాడు’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు, ట్రైలర్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. నాగశౌర్యని మాస్‌లుక్‌లో చూపిన విధానం అందరికీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం రిలీజ్‌ డేట్‌ను కూడా ఖరారు చేసుకొన్నట్లు సమాచారం.
మే 29న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి యూనిట్‌ సిద్దం అవుతోంది. ఈ సినిమా హిట్టైతే ఇక పక్కాగా యాక్షన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలతో దూసుకువెళ్లాలనే ఆలోచనలో హీరో నాగశౌర్య ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ‘చింతకాయల రవి’ దర్శకుడు యోగేష్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. హీరోయిన్‌గా బుల్లితెర మీద ‘హర హర మహాదేవ’లో పార్వతి పాత్ర పోషించి దేశవ్యాప్తంగా పేరుతెచ్చుకున్న సోనారిక హీరోయిన్‌గా నటిస్తోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ