Advertisementt

‘గంగ’ కి ఎదురేలేదు..!

Sat 09th May 2015 06:19 PM
ganga,ok bangaram,uttama villain,son of satyamurthy,box office collections  ‘గంగ’ కి ఎదురేలేదు..!
‘గంగ’ కి ఎదురేలేదు..!
Advertisement
Ads by CJ

మొన్నవారం విడుదలైన రెండు చిత్రాలు మంచి అంచనాలతో వచ్చిన తమిళ డబ్బింగ్‌ చిత్రాలే కావటం విశేషం. అందులో ఒకటి తనే హీరోగా చేస్తూ డైరెక్ట్‌ చేసిన లారెన్స్‌ ‘గంగ’.. కాగా తానే కథ, స్క్రీన్‌ప్లే వంటివి అందిస్తూ తనే హీరోగా నటించిన కమల్‌హాసన్‌ ‘ఉత్తమవిలన్‌’ మరొకటి. ఈ రెండు చిత్రాలు ఆయా హీరోల మానసపుత్రికలే. ఈ రెండు ఎప్పటినుంచో వస్తాము.. వస్తాం... అంటూ ఒకదానికొక్కటి పోటీగా మార్కెట్లో విడుదలయ్యాయి. దానికి తోడు రెండు చిత్రాలు ఆర్ధిక ఇబ్బందులతో రిలీజ్‌కు ఇబ్బంది పడినవే.

ట్రేడ్‌వర్గాల సమాచారం ప్రకారం ఉన్నంతలో ‘గంగ’ చిత్రానికి మంచి రిపోర్ట్‌ సొంతం చేసుకుంది. రొటీన్‌ హర్రర్‌ సినిమానే అనిపించుకున్నప్పటికీ బి,సి సెంటర్లల వద్ద ఈ సినిమా బాగా వర్కౌట్‌ అవుతోంది. ఇప్పటివరకు ఈ చిత్రం 12కోట్లువసూలు చేసిందని సమాచారం. అదే ‘ఉత్తమవిలన్‌’ సినిమా విషయానికి వస్తే మార్నింగ్‌ షో నుంచే బోర్‌ సినిమా అని టాక్‌ తెచ్చుకోవడం మైనస్‌ అయింది. మొదటి వీకెండ్‌లో కేవలం 1.5కోట్లు మాత్రమే సాధించింది. అలాగే మణిరత్నం ‘ఓకేబంగారం’ కేవలం మల్టీప్లెక్స్‌ అడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. బి,సి సెంటర్లలో ఈ సినిమాను పట్టించుకునే వారు లేరు.ఇక నాగచైతన్య ‘దోచెయ్‌’ కూడా డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే ఇప్పటికీ అల్లుఅర్జున్‌`త్రివిక్రమ్‌ల ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ వీకెండ్‌లలో ఫ్యామిలీ ఆడియన్స్‌తో కళకళలాడుతోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ