Advertisementt

చిరు, చరణ్‌ల మద్దతు పద్దతి కాదు!

Sat 09th May 2015 06:16 PM
chiranjeevi,salman khan,ram charan,salman case,celebrities,mumbai  చిరు, చరణ్‌ల మద్దతు పద్దతి కాదు!
చిరు, చరణ్‌ల మద్దతు పద్దతి కాదు!
Advertisement
Ads by CJ

మద్యం సేవించి కారు నడిపి ఒకరి మరణానికి, నలుగురు తీవ్రంగా గాయపడటానికి కారణమైన హిట్‌ అండ్‌ రన్‌ కేసులో సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. అయితే సల్మాన్‌కు సినీ పరిశ్రమలో గుడ్‌నేమ్‌ ఉండటం, మంచోడు అనే ట్యాగ్‌ ఉండటం, పలు సేవా కార్యక్రమాల్లో భాగస్వామి కావడంతో నేరం చేసినప్పటికీ ఆయనపై సానుభూతి వెల్లువెత్తుతోంది. సల్మాన్‌కు బెయిల్‌ లభించడంతో సల్మాన్‌ను పరామర్శిచేందుకు బాలీవుడ్‌ సెలబ్రిటీలు అంతా ఆయన ఇంటి ముందు క్యూ కడుతున్నారు. ఆయన స్నేహితులు మాత్రం రోడ్లపై నిద్రించిన ఆ పేదలదే తప్పు అని అంటూ రోడ్దుపై అడ్డువస్తే కుక్కలు కూడా చస్తాయి.. అని నీచంగా మాట్లాడుతున్నారు. విచిత్రం ఏమిటంటే టాలీవుడ్‌లో కూడా ఆయనకు అనుకూలంగా పలువురు మాట్లాడుతున్నారు. మెగాస్టార్‌ చిరంజీవితో పాటు రామ్‌చరణ్‌,మంచు లక్ష్మీ,హన్సిక, రకుల్‌ప్రీత్‌సింగ్‌.. వంటివారు. సల్మాన్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేయడం గర్హనీయం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ