త్రిష, వరుణ్‌లు దాదాపు విడిపోయినట్లే... వీళ్లిద్దరి మధ్య చెప్పుకోలేనంత, పూడ్చుకోలేనంత గ్యాప్ వచ్చిందిట. అయితే వీరి కటీఫ్‌కు ఓ హీరో కారణమని కోలీవుడ్ మీడియా అంటోంది. ఆ హీరో ఎవరో కాదు..ధనుష్ అట...! త్రిష, ధనుష్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్ షిప్ వరుణ్‌కి నచ్చలేదు. ఈ విషయాన్ని చాలాసార్లు త్రిషకు చెప్పడంతో వారి మధ్య పెద్ద ఎత్తున గొడవలు మొదలయ్యాయి అంటున్నారు. దీంతో త్రిష ఓ పార్టీకి దనుష్‌ను ఆహ్వానించి వరుణ్ చూస్తుండగానే ధనుష్‌తో చాలా క్లోజ్‌గా బిహేవ్ చేసిందట...! దీంతో ఈ విషయాన్ని తట్టుకోలేకపోయిన వరణ్ త్రిషకి కటీఫ్ చేసేశాడని సమాచారం. మొత్తానికి ప్రియుడి కంటే ఫ్రెండ్‌షిప్‌కే ఎక్కువ విలువ ఇచ్చిన త్రిషను కోలీవుడ్ మీడియా ఆకాశానికి ఎత్తేస్తోంది. వినడానికి ఇది సినిమా స్టోరీలా ఉన్నప్పటికీ ఇది నిజం అని కోలీవుడ్ మీడియా అంటోంది.