‘గంగ’ చిత్రం తమిళంతోపాటు తెలుగులో కూడా మంచి కలెక్షన్లు సాధిస్తోంది. అయితే ఇటీవల కాలంలో మంచి చిత్రాలుగా పేరుతెచ్చుకున్న ‘ఉత్తమవిలన్, ఓకే బంగారం, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చిత్రాలు కూడా కనీసపు ఓపెనింగ్స్, లాంగ్‌రన్ లేక ఇబ్బందులు పడ్డాయి. ‘దోచెయ్’ చిత్రం కూడా క్లాస్ ఆడియన్స్‌ను, మల్టీప్లెక్స్ ఆడియన్స్‌ను, ‘ఎ’ సెంటర్లను టార్గెట్ చేసి ఘోరంగా పరాజయం చవిచూసింది. దీన్నిబట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే.. కేవలం ‘ఎ’ సెంటర్లు, మల్టీప్లెక్స్‌లను నమ్ముకోకుండా ఊరమాస్‌చిత్రాలు తీసి, దానిలో కాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌ను కలిపితే ఆ సినిమా ఖచ్చితంగా సేఫ్ ప్రాజెక్ట్ అవుతుందనేది ట్రేడ్‌వర్గాల విశ్లేషణ. కేవలం మంచి చిత్రాలు తీయాలనుకునే వారు నష్టపోతున్నారని, సినిమా మొత్తం మాస్‌ను, కామెడీని టార్గెట్‌చేసిన వారు మాత్రం సేఫ్ అవుతున్నారనేది వాస్తవం.