Advertisementt

ట్రైలర్‌కు మాత్రమే డబ్బింగ్‌ చెప్పాడట!

Fri 08th May 2015 08:01 AM
hero ram,pandaga chesko movie,remuneration  ట్రైలర్‌కు మాత్రమే డబ్బింగ్‌ చెప్పాడట!
ట్రైలర్‌కు మాత్రమే డబ్బింగ్‌ చెప్పాడట!
Advertisement
Ads by CJ

హీరో రామ్‌ నటిస్తున్న ‘పండగచేస్కో’ చిత్రం ట్రైలర్‌ ఇటీవలే విడుదలైంది. కానీ రామ్‌ మాత్రం తన నిర్మాతను డబ్బుల విషయంలో నమ్మడంలేదు. అంత నమ్మకం లేకపోతే మా అసోసియేషన్‌, ఫిల్మ్‌చాంబర్‌ వంటివి ఉన్నాయనే విషయాన్ని కూడా రామ్‌ పట్టించుకోవడం లేదు. తనకు నిర్మాత డబ్బు ఎగ్గొడితే న్యాయం చేయడానికి కావాల్సిన సంస్థలు ఎన్నో ఉన్నాయి. అయినా కూడా రామ్‌ వారిని కూడా నమ్మడం లేదు. తనకు బకాయి ఉన్న 50లక్షలను వెంటనే ఇస్తేనే తాను సినిమాకు డబ్బింగ్‌ చెబుతానని ఖరాఖండీగా చెబుతున్నాడు. అందుకే చివరకు బతిమిలాడగా బతిమిలాడగా కేవలం ట్రైలర్‌ వరకు మాత్రం ఆయన డబ్బింగ్‌ చెప్పాడని, ఇంకా సినిమాకు డబ్బింగ్‌ చెప్పలేదని నిర్మాత వాపోతున్నాడట. మరి రామ్‌ ఎప్పుడు డబ్బింగ్‌ పూర్తి చేస్తోడో? సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ