‘హరహరమహాదేవ’ సీరియల్‌లో పార్వతిగా కనిపించి అందరినీ ఆకట్టుకున్న అమ్మాయి సోనారిక. ఈమె ప్రస్తుతం నాగశౌర్య సరసన ‘జాదూగాడు’ చిత్రంలో నటిస్తోంది. తొలి సినిమా రిలీజ్ కాకముందే ఆమెకు మరో అవకాశం దక్కింది. ‘అల్లుడుశీను’తో ఆమె జతకట్టనుంది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో నిర్మాణం అవుతోన్న చిత్రంలో ఈ జాదూ భామ నటిస్తోంది.. ఈ చిత్రం తమిళ చిత్రం ‘సుందర్‌పాండియన్’కు రీమేక్‌గా తెరకెక్కనుంది. మొత్తానికి ఈ భామ అవికాగోర్‌లాగా తెలుగు వారికి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకునే విధంగా తన కెరీర్‌ను మలుచుకొంటుండటం విశేషం.