దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ సినిమా అంటే దాంట్లో హింస, శృంగారంతో పాటు అన్ని అంశాలు మోతాదుకు మించి ఉంటాయని సెన్సార్ వారికే కాదు... సాధారణ ప్రేక్షకులకు కూడా తెలుసు. ‘శివ’ చిత్రంతో దర్శకునిగా పరిచయం అయిన వర్మ తన ఇన్నేళ్ల కెరీర్‌లో క్లీన్ యు సర్టిఫికేట్ ఇప్పటివరకు పొందలేదు. అయితే తొలిసారిగా ఆయన తెరకెక్కించిన ‘365డేస్’ చిత్రానికి సెన్సార్ బోర్డ్ క్లీన్ యు సర్టిఫికేట్ ఇవ్వడం ఆశ్యర్యకరమైన విషయమే. అదే ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో హాట్ టాపిక్ అయింది. సెన్సార్ సర్టిఫికేట్ లాగానే ఈ చిత్రం క్లీన్‌గా ఉండి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందో లేదో చూడాలి..! మొత్తానికి ఈ అనుభవం వర్మకు ఎదురైన వింతైన అనుభవంగా ఆయన కెరీర్‌లోనే నిలిచిపోతుంది.