ప్రస్తుతం టాలీవుడ్‌లో నెంబర్‌వన్ ఎవరు? అనే ప్రశ్నకు ఎవరైనా సరే పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబుల పేర్లే చెబుతారు. వీరిద్దరి మధ్య పోటీ నువ్వా? నేనా? అన్నట్లుగా ఉంది. కాగా వచ్చే ఏడాది అంటే 2016 సంక్రాంతికి పవన్‌కళ్యాణ్ నటించే ‘గబ్బర్‌సింగ్2’ విడుదల అవుతుందని అంటున్నారు. ఇక మహేష్‌బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందనున్న ‘బ్రహ్మోత్సవం’ చిత్రం కూడా వచ్చే ఏడాది సంక్రాంతి సమయంలోనే విడుదలకు సిద్దమవుతుంది. మరి వచ్చే ఏడాదికి ఈ రెండు చిత్రాల హడావుడి, వారి చిత్రాలు వసూలు చేసే కలెక్షన్లు ఎలా ఉంటాయి? అనే విషయంపై ఈ ఇరువురి అభిమానుల మధ్య చర్చ సాగుతోంది.