Advertisementt

‘రుద్రమదేవి’ ఎప్పుడు?

Tue 05th May 2015 03:12 AM
rudhramadevi,anushka,rudhramadevi release date,allu arjun  ‘రుద్రమదేవి’ ఎప్పుడు?
‘రుద్రమదేవి’ ఎప్పుడు?
Advertisement
Ads by CJ

వేసవి ఇప్పటికే మూడొంతులు పూర్తయింది. ఇక మిగిలింది చాలా తక్కువరోజులే. అయితే గుణశేఖర్‌ తన స్వీయనిర్మాణ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘రుద్రమదేవి’ ఎప్పుడు విడుదలవుతుందో ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఆ చిత్రాన్ని కొన్న బయ్యర్లు, ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులు బాగా విసిగిపోయారు. ఆడియో అంటూ రెండు చోట్ల హడావుడి చేసిన గుణశేఖర్‌ మాత్రం ఇప్పటివరకు తన చిత్రంపై పెదవి విప్పడంలేదు. దీన్నిబట్టి సినీవర్గాలు ఈ చిత్రం ఇక వేసవికి రావడం కష్టమేనని, జూన్‌ లోపల ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం లేదని తేల్చేస్తున్నారు. ముద్దొచ్చినప్పుడే చంకనెక్కాలి.. అనే సామెత ప్రకారం క్రేజ్‌ ఉన్నప్పుడే సినిమాను విడుదల చేసి క్యాష్‌ చేసుకోవాలనే ప్రాధమికసూత్రాన్ని గుణశేఖర్‌ పాటించకపోవడం ఆయనకు చాలా కష్టనష్టాలను తెస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ