Advertisementt

రానాని సైకో అనేసిందేంటి?!

Tue 05th May 2015 01:03 AM
rana,trisha comments on rana,trisha,rana psyco,  రానాని సైకో అనేసిందేంటి?!
రానాని సైకో అనేసిందేంటి?!
Advertisement
Ads by CJ

కథానాయిక త్రిషకీ, రానాకీ మధ్య రిలేషన్‌ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్లిద్దరూ కొంతకాలం పాటు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. కలిసి సినిమా చేయకపోయినా సరే... ఫొటో షూట్‌లు కూడా చేయించుకొన్నారు. అప్పట్లో పెళ్లి కూడా చేసుకొంటారని ప్రచారం సాగింది. అయితే అనూహ్యంగా త్రిష చెన్నైకి చెందిన వ్యాపారవేత్త వరుణ్‌ మణియన్‌తో ప్రేమలో పడిరది. కొంతకాలం క్రితమే వాళ్లిద్దరికి  నిశ్చితార్థం కూడా జరిగింది. త్వరలోనే పెళ్లికూడా ఉంటుందని త్రిష ప్రకటించింది. అయితే ఇటీవల మాత్రం ఇద్దరి మధ్యా విభేదాలు పొడసూపాయనీ... పెళ్లి కూడా క్యాన్సిల్‌ అయ్యిందని ప్రచారం సాగుతోంది. ఆ విషయం గురించి ఇటు త్రిష కానీ, అటు వరుణ్‌ కానీ ఖండిచనే లేదు. దీన్నిబట్టి ఆ వార్త నిజమే అని ప్రచారం సాగుతోంది. ఒక సినిమా విషయంలో ఇద్దరి మధ్యా భేదాభిప్రాయాలు వచ్చాయనీ, అందుకే పెళ్లి చేసుకోకూడదనే నిర్ణయానికి వచ్చారని తమిళ సినీ వర్గాలు మాట్లాడుకొంటున్నాయి. మొన్నామధ్య వరుణ్‌ సోదరి వివాహం జరిగినా త్రిష హాజరుకాలేదు. తన స్నేహితులతో చెన్నైలోనే పార్టీ చేసుకొంటూ గడిపింది. సోమవారం త్రిష పుట్టినరోజుని పురస్కరించుకొని అందరూ శుభాకాంక్షలు చెబుతున్నా... వరుణ్‌ నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదు. దీన్నిబట్టి వీళ్లిద్దరూ కటీఫ్‌ చెప్పుకొన్నట్టే అంటున్నారంతా. అయితే రానా మాత్రం రాత్రి 12 దాటగానే త్రిషకి ట్వీట్‌ చేసి శుభాకాంక్షలు చెప్పాడు. ‘థ్యాంక్యూ సైకో...’ అంటూ త్రిష రిప్లై ఇచ్చింది. రానాని సైకో అంటోందంటే వాళ్లిద్దరి మధ్య రిలేషన్‌ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వీళ్లిద్దరూ మళ్లీ ఒక్కటయ్యే అవకాశం  లేకపోలేదని చెన్నై సినిమా వర్గాలు చెబుతున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ