విభిన్నమైన చిత్రాలతో ఆకట్టుకుంటున్న కథానాయకుడు నిఖిల్ నటించనున్న తాజా చిత్రం ‘శంకరాభరణం’. క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి కోనవెంకట్ సమర్పకుడిగా వుండటంతో పాటు కథ, మాటలు అందిస్తున్నాడు. అంజలి నాయికగా గీతాంజలి చిత్రాన్ని నిర్మించిన నిర్మాత ఎమ్‌వీవీ సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ఉదయ్ నందనవనం దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కాగా ఈ చిత్రంలో నిఖిల్ తన సరసన రకుల్‌ప్రీత్‌సింగ్‌ను నాయికగా తీసుకోవాలని దర్శక, నిర్మాతలను కోరుతున్నాడట. ప్రస్తుతం తెలుగులో చేతినిండా సినిమాలతో ఫుల్‌బిజీగా వున్న రకుల్‌ను ఎలాగైనా ఒప్పించి తన పక్కన నటింపజేయాలని నిఖిల్ మారం చేస్తున్నాడని ఫిల్మ్‌నగర్ టాక్. అయితే ఇది ఎలాగో జరిగే పని కాదని తెలిసిన కోనవెంకట్ మాత్రం నిఖిల్ కోరికను పెద్దగా పటించుకోవడం లేదట..!