Advertisementt

చైతూకి చేదు అనుభవం!

Mon 04th May 2015 08:41 AM
naga chaitanya,oka laila kosam movie,dohchay movie  చైతూకి చేదు అనుభవం!
చైతూకి చేదు అనుభవం!
Advertisement
Ads by CJ

బయటకు అక్కినేని ఫ్యామిలీ ఎంత పెద్ద బిల్డప్‌ ఇస్తున్నప్పటికీ హీరో నాగచైతన్యకు పెద్దగా క్రేజ్‌ లేదనే విషయం అంగీకరించాల్సిందే. చాలా బాగుందని టాక్‌ వచ్చిన ‘100%లవ్‌, తడాఖా’ చిత్రాలు కలెక్షన్ల పరంగా పెద్దగా వసూలు చేయలేకపోయాయి. ఇక తాజాగా వచ్చిన ‘దోచెయ్‌’ చిత్రం చైతూకు పీడకలగా మారింది. దీని ముందు చిత్రం ‘ఒక లైలా కోసం’ కూడా పెద్దగా ఆడకపోవడంతో, ‘దోచెయ్‌’ చిత్రానికి కూడా మొదటి షో నుండే బ్యాడ్‌టాక్‌ స్ప్రెడ్‌ అయింది. సోలోగా వచ్చినప్పటికీ ఈ చిత్రం పూర్తిగా కలెక్షన్లు ఖాళీ అయ్యాయి. మొత్తం కలిపి ఈ చిత్రానికి వారం రోజుల్లో మొత్తం రెండుకోట్ల షేర్‌ మాత్రమే వచ్చిందని, శాటిలైట్‌కు ఓ నాలుగు కోట్లు వచ్చినప్పటికీ ఈ చిత్రం నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు కలిగించడం ఖాయమని తేలిపోయింది. కేవలం 12కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రమే ఇంత నష్టాలను చవిచూస్తే.. ఇక అదే భారీ బడ్జెట్‌ చిత్రం అయితే పరిస్థితి దారుణంగా ఉండేదని ట్రేడ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ