Advertisementt

రజనీ సినిమా టైటిల్‌ ఇదేనా!

Mon 04th May 2015 07:36 AM
rajinikanth,linga movie,director shankar,rajinikanth no1 movie  రజనీ సినిమా టైటిల్‌ ఇదేనా!
రజనీ సినిమా టైటిల్‌ ఇదేనా!
Advertisement
Ads by CJ

దర్శకుడు శంకర్‌కు ‘ఐ’ చిత్రం నిరాశనే మిగిల్చింది. మరోవైపు రజనీకి వరుసగా ‘విక్రమసింహా, లింగా’ చిత్రాలు డిజాస్టర్‌గా నిలిచాయి. వీరిద్దరికీ ప్రస్తుతం వెంటనే ఓ పెద్ద హిట్‌ అవసరం. ఈ ఇద్దరు కలిసి ఓ చిత్రానికి పనిచేయనున్నారని ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. కాగా ఈ చిత్రం స్క్రిప్ట్‌తో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులతో పాటు టైటిల్‌ కూడా ఖరారైందని కోలీవుడ్‌ సమాచారం. ఈ చిత్రం టైటిల్‌ను ‘నెంబర్‌వన్‌’ అని ఫిక్స్‌ చేసినట్లు సమాచారం. కాగా ఇది ‘రోబో’కు సీక్వెలా ? కాదా? అనేది తెలియరావడం లేదు. ఇదే టైటిల్‌తో గతంలో సూపర్‌స్టార్‌ కృష్ణ ఎస్వీకృష్ణారెడ్డిల కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఇది నిజమా? కాదా? అనే విషయం పక్కనపెడితే రజనీకాంత్‌ ఇమేజ్‌కు సరిగ్గా సరిపడే టైటిల్‌ ఇదే అని ఒప్పుకోకతప్పదు.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ