కమల్ హాసన్, సారికల గారల పట్టి శృతి హాసన్. వారసత్వంగా ముఖానికి మేకప్ వేసుకుని నటిస్తున్న శృతికి సంగీతంపై కూడా మక్కువ. ప్రస్తుతానికి నటన మీద ఎక్కువ ఫోకస్ చేసింది. నటనలో తల్లిదండ్రులతో కంపేర్ చేయడంపై శ్రుతికి విసుగోస్తుందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించింది. ఒక తండ్రి మరియు కుమార్తె లేదంటే ఎవరైనా కావచ్చు.. ప్రతి ఒక్కరికి తమ స్వంత శైలి ఉంటుంది. నా తల్లిదండ్రుల తరహాలో నేను నటించడం అసాధ్యం. నటనలో నన్ను వారితో పోల్చిచూడొద్దని చెప్పింది.
కెరీర్ ప్రారంభంలో అంతా సులభంగా జరగలేదు. కమల్ హాసన్ కుమార్తె కావడంతో నన్ను కథానాయికగా ఎంపిక చేసుకునేవారు. సినిమా ఫెయిల్ అయినప్పుడు మన వెంట ఎవరూ ఉండరు. మన స్ట్రగుల్స్ మనమే పేస్ చేయాలని శృతి హాసన్ సెలవిచ్చింది. ఎటువంటి పాత్రనైనా అవలీలగా పోషించగల కమల్ నటనతో ఎవరినీ కంపేర్ చేయలేం. ఈ విషయం శృతికి బాగా తెలుసు. అందుకే ఇలా ముందు జాగ్రత్త పడింది.