నటి సుస్మితాసేన్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్‌లో నటీనటులంతా చెడిపోయారంటూ వ్యాఖ్యానించింది. ఆమె తన తొలి బెంగాళీ చిత్రం ‘నిర్భక్’ చిత్రంలో నటిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ప్రతిభావంతులైన నటీనటులు, సిబ్బందితో పని చేస్తున్నట్లు ఉప్పొంగిపోయిన ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయింది. బెంగాళీలోనే కాదు..భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన బెస్ట్ యాక్టర్లతో కలిసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను. వివిధ వయసుల వారితో కలిసి పనిచేశాను. కానీ నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను. బాలీవుడ్‌లో మేమంతా చెడిపోయాం...’ అంటూ సుస్మితాసేన్ చెప్పింది. అమ్మడు బాలీవుడ్ మీద ఏ ఉద్దేశ్యంతో ఈ వ్యాఖ్యలు చేసిందో అర్థం కావడం లేదని బాలీవుడ్ వర్గాలు జట్టుపీక్కుంటున్నాయి.