పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌ని కలిసేందుకు అద్దంకి రవి అనే అభిమాని దాదాపు 1500 కిలోమీటర్లు పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ నుంచి సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అద్దంకి రవి చర్యను పనికి మాలిన చర్యగా అభివర్ణించాడు వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. సైకిల్‌పై ఇంత దూరం వచ్చి తన సమయాన్ని, శక్తిని రెండింటిని అతను కోల్పోయాడని.. రెండింటిని వృథా చేసుకున్నాడని ఆయన రైలులో వచ్చి ఆ సమాయాన్ని వేరొక మంచి పని కోసం వెచ్చించి ఉంటే బాగుండేదని వర్మ ట్వీట్ చేశాడు. పవన్ కూడా ఇలాంటి పనికిమాలిన చర్యలను ప్రోత్సహించవద్దని, పవన్ అభిమానులెవ్వరూ అలాంటి పనికిమాలిన చర్యలు చేయవద్దని చెప్పాడు. పవన్ ఇచ్చిన ఆలింగనంతోనైనా సైకిల్‌పై వచ్చిన అభిమాని మారతాడని ఆశిస్తున్నాను. నేను పవన్ అభిమానులను చాలా ప్రేమిస్తాను. ఎందుకంటే నేను కూడా పవన్‌కళ్యాణ్ అభిమానినే అంటూ ట్వీట్ చేశాడు. మొత్తానికి ఈ ట్వీట్ అందరినీ ఆలోచించే విధంగా ఉందనే ప్రశంసలు లభిస్తున్నాయి.