Advertisementt

నిత్యను పట్టించుకోని లారెన్స్‌!

Sat 02nd May 2015 02:40 AM
nitya menen,ganga movie,raghava lawrence  నిత్యను పట్టించుకోని లారెన్స్‌!
నిత్యను పట్టించుకోని లారెన్స్‌!
Advertisement
Ads by CJ

‘గంగ’ చిత్రంలో కీలకపాత్ర పోషించిన నిత్యామీనన్‌ ప్రచార చిత్రాల్లో మాత్రం అసలు కనిపించడంలేదు. పాపులారిటీ పరంగా చూసుకున్నా కూడా తాప్సి కంటే నిత్యామీననే బెటర్‌. అయినా లారెన్స్‌ తన చిత్రం ప్రమోషన్‌ కోసం నిత్యాను వాడుకోవడం లేదు. ఈ చిత్రం షూటింగ్‌ సమయంలోనే నిత్యకు లారెన్స్‌కు అసలు పడేది కాదని, సెట్స్‌లో కూడా ఇద్దరు ఎడమొహం.. పెడమొహంలాగా ఉండేవారని సమాచారం. లారెన్స్‌ టేకుల మీద టేకులు తీయడం, చాలా సన్నివేశాలను రీషూట్‌ చేయడం వల్ల నిత్య చాలా ఇబ్బంది పడిందట . అంతేకాదు... ఒకసారైతే ఆమె ఏకంగా షూటింగ్‌ నుంచి చెప్పపెట్టకుండా వెళ్లిపోవడంతో లారెన్స్‌ బతిమిలాడి ఆమెను తీసుకొని వచ్చి షూటింగ్‌ పూర్తి చేశాడని, ఇప్పుడు సినిమా ఎలాగూ హిట్‌టాక్‌ సొంతం చేసుకోవడంతో అన్నీతానై నిత్యను పట్టించుకోవడం లేదనేది కోలీవుడ్‌ టాక్‌.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ