రాఘవలారెన్స్‌కు ఇంపార్టెంట్ రోల్స్ ఇచ్చి, దర్శకునిగా అవకాశం ఇచ్చిన టాలీవుడ్‌ను ఆయన ఈ మధ్య పట్టించుకోవడం మానేశాడు. తలా పాపం తిలా పిడికెడు అన్నట్లుగా ఆయనకు డైరెక్టర్‌గా ‘మాస్, డాన్’ చిత్రాలకు దర్శకునిగా అవకాశం ఇవ్వడంతో పాటు ఆయా చిత్రాల్లో తనకు సమానమైన క్యారెక్టర్లను ఇచ్చిన ఘనత నాగార్జునకు దక్కుతుంది. కానీ ‘రెబెల్’ చిత్రంతో ఒక్కసారిగా ఆయనపై ఉన్న నమ్మకాలు వీడిపోయాయి. సినిమా హిట్టా, ఫ్లాప్పా.. అనేది దర్శకుడి చేతిలో లేకపోయినా ఆ చిత్రానికి టేక్‌ల మీద టేకులు తీసి, తీసిన సన్నివేశాలనే మరలా మరలా రీషూట్ చేసి నిర్మాతలనే కాదు..హీరో ప్రభాస్‌ను కూడా విసిగించి బాగా ఇబ్బందిపెట్టాడు. కానీ ఒక్కసారిగా లారెన్స్ ‘కాంచన2’తో హిట్టు కొట్టడంతో నిన్నటివరకు తప్పించుకుని తిరిగిన నిర్మాతలు,హీరోలు ఇప్పుడు మరలా ఆయనతో సినిమా చేయడానికి తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. ‘ముని, కాంచన, గంగ’ చిత్రాల హిట్‌తో లారెన్స్ డేట్స్ ఇస్తే ఆయన దర్శకత్వంలో నటించడమే కాదు... కావాలంటే ఈ మూడు చిత్రాలకు సీక్వెల్‌గా రూపొందే నాలుగో చిత్రంలో కూడా లారెన్స్‌తో కలిసి నటించి మల్టీస్టారర్ లుక్ తేవడానికి రెడీ అవుతున్నారట. త్వరలో మరలా లారెన్స్‌కు నాగ్ మరో చిత్రం చేసే అవకాశం ఇస్తున్నాడని ఇండస్ట్రీ టాక్.