‘విక్రమార్కుడు, చత్రపతి’ వంటి భారీ చిత్రాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పేరుతెచ్చుకుని, ‘సారాయి వీర్రాజు, దిక్కులు చూడకు రామయ్య’ వంటి చిత్రాల్లో ప్రధాన పాత్ర పోషించిన నటుడు, టాలెంటెడ్ ఆర్టిస్ట్ అజయ్. కాగా ఈయన ‘ఇష్క్’ చిత్రంలో మంచి ప్రతిభ చూపించాడు. ఇప్పుడు అదే సినిమా ఆయనకు తమిళంలో ఓ పెద్ద హీరోతో కలిసి నటించే అవకాశాన్ని తీసుకొచ్చింది. త్వరలో ‘ఇష్క్, మనం’ చిత్రాల దర్శకుడు తమిళ, తెలుగు భాషల్లో సూర్య హీరోగా ‘24’ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సూర్య స్వయంగా నటిస్తూ... నిర్మిస్తున్నాడు. ‘ఇష్క్’ చిత్రంలో అజయ్ చూపిన పర్‌ఫార్మెన్స్‌కు ముగ్దుడైన విక్రమ్‌కుమార్, సూర్యతో పట్టుబట్టి మరీ అజయ్‌ను కీలకపాత్రకు తీసుకున్నాడని తెలుస్తోంది. మొత్తానికి అజయ్ టాలెంట్ కోలీవుడ్‌కు కూడా వెళ్లుతుండటంతో ఇక నుండి ఆయన చిత్రాలకు తెలుగుతోపాటు తమిళంలో కూడా ప్రత్యేక మార్కెట్ లభించే అవకాశం ఉంది....!