ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు అందరూ ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ చిత్రాల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రాలు ఎప్పుడు విడుదల అవుతాయో? చెప్పలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికే ‘బాహుబలి’ చిత్రాన్ని మే 15 నుండి జులైకు పోస్ట్‌పోన్ చేశారు. తేదీ మాత్రం ఇంకా ప్రకటించలేదు. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను మే31న విడుదల చేస్తామని రాజమౌళి అనౌన్స్ చేశాడు. అయితే ఈ చిత్రం ట్రైలర్‌కు ముందే ‘రుద్రమదేవి’ని థియేటర్లలోకి తేవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్స్, ఆడియో అందరినీ ఆలరిస్తున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఓ కొలిక్కి వచ్చిందిట. దీంతో మే 22న ‘రుద్రమదేవి’ని థియేటర్లలోకి తేవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.