Advertisementt

షూటింగ్‌ల పేరుతో విదేశీ ప్రయాణాలు!

Fri 01st May 2015 03:06 PM
star heroes,summer vecation,ramcharan,mahesh babu,jr ntr  షూటింగ్‌ల పేరుతో విదేశీ ప్రయాణాలు!
షూటింగ్‌ల పేరుతో విదేశీ ప్రయాణాలు!
Advertisement
Ads by CJ

ఈ వేసవిలో భానుడు  ఏప్రిల్‌ నెలలోనే నిప్పులు కక్కుతున్నాడు. ఎండలు ఏప్రిల్‌లోనే ఇలా ఉంటే మే నెలలో ఇంకెంతగా ఉంటాయో ఊహించుకోవడానికే భయం వేస్తోంది. దీంతో మన స్టార్‌హీరోలు షూటింగ్‌ల పేరుతో విదేశాలకు వెళ్లి సేద తీరడానికి, అదీ నిర్మాత ఖర్చులతో ఊరట చెందడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. రామ్‌చరణ్‌ శ్రీనువైట్ల చిత్రం షూటింగ్‌ నిమిత్తం యూరప్‌, మహేష్‌బాబు  కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న ‘శ్రీమంతుడు’ చిత్రం కోసం మలేషియా.. ఎన్టీఆర్‌ అయితే సుకుమార్‌ చిత్రం షూటింగ్‌ను కూడా విదేశాల్లోనే ప్రారంభించి అక్కడే ఈ వేసవిని గడిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బన్నీ లండన్‌కు వెళ్లి అక్కడే తన తదుపరి బోయపాటి శ్రీను సినిమా కోసం అక్కడే ఉండి స్టైలిష్‌లుక్‌, హెయిర్‌స్టెయిల్‌తో పాటు కండలు పెంచే పనిలో ఉండనున్నాడు. చివరకు హీరో నిఖిల్‌ కూడా అదే బాటలో యాక్టింగ్‌ కోర్సు కోసం అమెరికాలో గడుపుతున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ