కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ కుమార్తె వివాహం సంచలనం రేపుతోంది. ఈ వివాహం సంగీత్‌లో బాలీవుడ్ తారలు నృత్యాలు చేయడం అటు రాజకీయ వర్గాలు ఇటు సినీ అభిమానుల్లోనూ ఆసక్తిరేపుతోంది. దానం కుమార్తె వివాహంలో సంగీత్ కార్యక్రమానికి బాలీవుడ్‌నుంచి పలువురు నటులు వచ్చి నృత్యాలు చేసినట్లు పలు ఆంగ్ల పత్రికలు కథనాలు ప్రచురించాయి. బాలీవుడ్‌లో అగ్రస్థానంలో ఉన్న ప్రియాంకచోప్రా, రణబీర్‌కపూర్, రితేష్ దేశ్‌ముఖ్, జాక్వలిస్‌లు వచ్చి ఆ సంగీత్ కార్యక్రమంలో పాలుపంచుకున్నట్లు సమాచారం. ఏకంగా బాలీవుడ్ తారలతో తన కుమార్తె వివాహంలో నృత్యాలు చేపించాడంటే దానం పెద్ద మొత్తంలోనే పెళ్లి కోసం ఖర్చుచేసి ఉంటాడని భావిస్తున్నారు. అయితే ఈ సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడాలని దానం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే సంగీత్‌లో బాలీవుడ్ తారలు నృత్యాలు చేసిన విషయం తనకు తెలియదని దానం చెబుతున్నాడు. తనకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో అసలు సంగీత్‌కే రాలేదని ఆయన చెప్పారు. తన బంధువు అనిల్ కిషన్ వివాహం ఏర్పాట్లు చూసుకుంటున్నాడని చెప్పారు.