ఆర్టిస్టుగా యావత్ దేశం గర్వించదగ్గ నటుడు ప్రకాష్‌రాజ్. ఎన్నో పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసిన ఆయన తన అసలు కోరిక అయిన దర్శకుడిగా మాత్రం ఇప్పటివరకు సక్సెస్ కాలేకపోయాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన మూడు చిత్రాలు ఆయనకు నిరాశనే కలిగించాయి. ‘నాను కన్న కనుసు’ అనే కన్నడ చిత్రంతో దర్వకునిగా మారిన ప్రకాష్‌రాజు ఆ తర్వాత ‘ధోని’ చిత్రం తీశాడు. ఆ చిత్రం కూడా పెద్దగా ఆడలేదు. ఇక ఎన్నో ఆశలతో మలయాళం చిత్రాన్ని ‘ఉలవచారు బిరియాని’గా రీమేక్ చేశాడు. ఇది కూడా బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాలేదు. తన చిత్రాలన్నింటిని ద్విభాషా చిత్రాలుగా తెరకెక్కించిన ఆయనకు ఏ భాషలోనూ దర్శకునిగా విజయం లభించలేదు. అయినా కూడా పట్టువదలని విక్రమార్కుడుగా ఆయన తన ‘ఉలవచారు బిరియాని ’ చిత్రంపై ఉన్న నమ్మకంతో బాలీవుడ్‌లో ఇదే చిత్రాన్ని తన సొంత డైరెక్షన్‌లో తెరకెక్కించనున్నాడు. ఇందులో నానాపాటేకర్ కీలకపాత్ర పోషించనున్నాడు మరి హిందీలోనైనా ఈ చిత్రం విజయం సాదిస్తుందేమో చూడాలి.....!