మే 31న సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు. అదే రోజున పివిపి సంస్థ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందించే ‘బ్రహ్మోత్సవం’ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అంతే కాదు... ఈ చిత్రం విజయవాడ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనుందని సమాచారం. ఈ చిత్రంలో మహేష్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే రోజు మహేష్-కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందనున్న ‘శ్రీమంతుడు’ చిత్రం ఫస్ట్ టీజర్‌ని కూడా విడుదల చేయనున్నారు. కాగా ఈ చిత్రాన్ని జులై 17న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.