అడల్ట్‌స్టార్ ముద్ర నుంచి బయటపడి మెల్లిమెల్లిగా నటిగా నిరూపించుకోవాలనే తాపత్రయంలో వరుసగా సినిమాలు చేస్తూపోతున్న నటి సన్నిలియోన్. ‘జిస్మ్2’తో మొదలైన ఆమె ప్రయాణం ... ‘ఏక్ పహేలి లీలా’ దాకా అప్రతిహతంగా కొనసాగుతోంది. ‘ఏక్ పహేలి లీలా’ చిత్రం 40కోట్ల వరకు వసూలు చేసి మంచి హిట్‌గా నిలబడిరది. అయితే ఇప్పుడు ఆమెకు సరికొత్త సమస్య వచ్చిపడింది. సన్ని నటించిన చిత్రాలు శాటిలైట్ రైట్స్‌ని ఎవరూ తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే అవి లేట్ నైట్ ప్రసారం చేయాల్సి వస్తోంది. అలాగే ఆమె ఇంటర్వ్యూలు ప్రసారం చేసినా... మరొకటి చేసినా తమ చానెల్‌కు ఉండే ఫ్యామిలీ ఇమేజ్ దెబ్బతింటుందనే భయంతో చానెల్స్ ఉన్నాయట. అందుకే ఆమె పబ్లిసిటీ కవరేజ్‌ను కూడా ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో ఆమెతో సినిమాలు చేయాలనుకునే వారికి ఈ సమస్య పెద్ద ఇబ్బందిగా తయారవుతోందని సమాచారం. ఈ సమస్య సన్ని కెరీర్‌ను డైలమాలోపడేస్తోంది....!