‘బాహుబలి’ చిత్రాన్ని మే 15న విడుదల చేస్తున్నట్లు గతంలో రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయతే టెక్నికల్‌పరమైన అంశాల విషయంలో ఆలస్యం అవుతుండటంతో విడుదల వాయిదా వేశారు. సినిమా వాయిదాపై వివరణ ఇస్తూ రాజమౌళి ఓ ప్రకటన కూడా చేశాడు. సినిమా అనుకున్న సమయానికి విడుదల చేయలేకపోతున్నామని చెప్పిన రాజమౌళి ఎట్టి పరిస్థితుల్లోనూ ‘బాహుబలి’ మొదటి భాగాన్ని జులైలో విడుదల చేస్తామని అంటున్నాడు. ఈమేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. అలాగే ‘బాహుబలి’ చిత్రం థియేట్రకల్ ట్రైలర్ రిలీజ్ డేట్ కూడా ప్రకటించాడు. మే 31న ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయనున్నామని రాజమౌళి తెలిసాడు.