Advertisementt

మహేష్ పై మనసు పడుతున్న మరో లేడి..!

Wed 29th Apr 2015 11:51 PM
pooja kumar,utthama villain,kamal hasan,mahesh babu  మహేష్ పై మనసు పడుతున్న మరో లేడి..!
మహేష్ పై మనసు పడుతున్న మరో లేడి..!
Advertisement
Ads by CJ

కమల్ హాసన్ తో వరుసగా 'విశ్వరూపం' , 'విశ్వరూపం2' , 'ఉత్తమవిలన్' చిత్రాలలో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి పూజాకుమార్. ప్రస్తుతం ఆమె నటించిన 'ఉత్తమవిలన్' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో చాలా అందంగా కనిపించబోతున్నానని పూజా చెప్పుకొచ్చింది. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పూజా తెలుగు ఇండస్ట్రీ స్టార్ హీరో మహేష్ ను తెగ పొగిడేసింది.

మహేష్ తెరపై కనిపించే విధానం అదిరిపోతుందని, తన సినిమాలు చూస్తుంటే ముచ్చటేస్తుందని, సినిమా కోసం ఏమైనా చేస్తాడని చెప్తూ మహేష్ తో నటించే అవకాశం వస్తే నేను రెడీ అని తన మనసులో మాటను వెల్లడించింది. మహేష్ సరసన ఈ అందాలభామ సూట్ అవుతుందనే చెప్పాలి. హీరోయిన్ల కొరత ఉందని భావిస్తున్న మన దర్శకనిర్మాతలు మరి ఆ వైపుగా ప్లాన్ చేస్తారేమో చూడాలి..!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ