కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసిన 'ఉత్తమ విలన్' మే 1న విడుదలవుతుంది. రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన గంగ కూడా అదే రోజున ప్రేక్షకుల ముందుకు వస్తుంది. గంగ విడుదలకు ఉన్న అడ్దంకిగా ఉన్న సమస్యలను నిర్మాత బెల్లంకొండ సురేష్ క్లియర్ పరిష్కరించినట్టు తెలుస్తుంది. టీవీలు, పత్రికలలో నిన్నటి నుండి ప్రచారం నిర్వహిస్తున్నారు. తమిళంలో ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో తెలుగులో మంచి అంచనాలు ఉన్నాయి. ఉత్తమ విలన్ సంగతి సరే సరి. గెటప్ లతో కమల్ క్రేజ్ తీసుకొచ్చారు. రెండు భారీ చిత్రాలు విడుదలకు సిద్దమవడంతో చిన్న చిత్రాలు పోటి నుండి తప్పుకుంటున్నాయి.
బాలకృష్ణ 'లయన్' విడుదల వాయిదా పడడంతో ఇదే మంచి సమయమని.. తమ చిత్రాలను విడుదల చేస్తునట్టు ప్రకటించిన నిర్మాతలు, గంగను చూసి వెనక్కు వెళ్ళారు. మంచు లక్ష్మీ దొంగట, దాగుడుమూత దండాకోర్ చిత్రాలు ఎల్లుండి విడుదల కావడం లేదు. శ్రీకాంత్ నటించిన ఢీ అంటే ఢీ ఒక్కటే బరిలో ఉంది. ఇతర చిత్రాలు గంగను చూసి భయపడ్డాయని పంపిణి వర్గాలలో వినిపిస్తున్న మాట. ఈ శుక్రవారం డబ్బింగ్ సినిమాలదే హవా. క్రేజ్ ఉన్న స్ట్రెయిట్ సినిమాలు రావడం లేదు. తమిళంతో పాటు కమల్, రాఘవ లారెన్స్ లకు తెలుగులో మంచి గుర్తింపు ఉండడంతో ఆ తేడా తెలియడం లేదు.