జనవరిలో విడుదలైన బేబీ చిత్రం తాప్సీకు హిందీలో మంచి విజయం అందించింది. అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన ఈ చిత్రంలో తాప్సీ చాలా చిన్న పాత్రలో కనిపించింది. హీరో వెంట నేపాల్ వెళ్లి సహాయ సహకారాలు అందించే ఆ పాత్రలో కాస్త యాక్షన్ కూడా చేసింది. యాక్షన్ సన్నివేశం చిత్రీకరించిన హోటల్లో భూకంపం దెబ్బకు స్విమ్మింగ్ పూల్ లో సునామి వచ్చినట్లు అయ్యింది. సిసి టీవీలలో ఆ దృశ్యాలు రికార్డు అయ్యాయి. నేపాల్ లో షూటింగ్ చేసిన మరో ప్రదేశం భూకంపం ధాటికి కుప్పకూలింది. ఈ ఘటన తాప్సీని కలచివేసింది. ఇక్కడ కూడా షూట్ చేశాం. జస్ట్, సో సో హార్ట్ బ్రేకింగ్ అంటూ తాప్సీ ట్వీట్ చేసింది.
సినిమాల విషయానికి వస్తే రాఘవ లారెన్స్ నటిస్తూ దర్శకత్వం వహించిన గంగ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించడం పట్ల చాలా సంతోషంగా ఉంది. తెలుగులో ఈ చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పింది. తెలుగు ప్రేక్షకుల తీర్పు లేకుంటే విజయం అసంపూర్తిగా ఉన్నట్టు తెలిపింది. రెండేళ్ళ తర్వాత తాప్సీ నటించిన సౌత్ సినిమా హిట్ కావడంతో పండగ చేసుకుంటుంది.