Advertisementt

అవికాగోర్‌కు మరో ఛాన్స్‌!

Tue 28th Apr 2015 11:46 AM
avika gor,director ram mohan,roshan movie,uyyala jampala,cinema choopista mava  అవికాగోర్‌కు మరో ఛాన్స్‌!
అవికాగోర్‌కు మరో ఛాన్స్‌!
Advertisement
Ads by CJ

‘చిన్నారి పెళ్లికూతురు’గా బుల్లితెర ద్వారా అందరికీ పరిచయమైన అమ్మాయి అవికాగోర్‌. ఆమె తన మొదటి చిత్రం ‘ఉయ్యాలా..జంపాలా’ చిత్రంలో నటించి పది పెద్ద హిట్‌ చిత్రాలలో నటించినంత పేరు ప్రఖ్యాతులు సాదించింది. ఆ తర్వాత ఆమె నటించిన ‘లక్ష్మీరావే మా ఇంటికి’ చిత్రం పెద్దగా ఆడకపోయినా అమ్మడు క్రేజ్‌ మాత్రం తగ్గలేదు. అయితే ఇష్టం వచ్చినట్లుగా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని  ఒప్పుకోకుండా చాలా ప్లానింగ్‌గా ఆమె ముందుకెళ్తోంది. ఇప్పుడు ఆమె ‘సినిమా చూపిస్తా మావా’ చిత్రంలో నటిస్తోంది. ‘ఉయ్యాలా..జంపాలా’ నిర్మాత రామ్మోహన్‌ ఇప్పుడు మెగాఫోన్‌ చేపట్టనున్నాడు. ఆయన దర్శకత్వంలో త్వరలో హీరో శ్రీకాంత్‌ పెద్ద కొడుకు రోషన్‌ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో రోషన్‌ సరసన రామ్మోహన్‌ అవికాగోర్‌ను ఎంచుకున్నట్లు తాజా సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ