సిద్దార్ధ్ హీరోగా వచ్చి తమిళంలో విజయవంతమైన ‘ఎనకుల్ ఒరువన్’ చిత్రాన్ని తెలుగులో ‘నాలో ఒక్కడు’ గా విడుదల కానున్న సంగతి తెలిసిందే. సిద్దార్ధ్, దీపసన్నిది జంటగా ప్రసాద్ రమర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. మరోపక్క ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ అమ్ముడయినట్లు సమాచారం. మాటీవీ వారు ఈ చిత్రం శాటిలైట్ హక్కులను 75లక్షలు వెచ్చించి సొంతం చేసుకున్నట్లు, ఈ చిత్రం మంచి సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందడంతో ఎక్కువ మంది వీక్షకులను సాదించవచ్చని మాటీవీ యోచనగా తెలుస్తోంది.