సాధారణంగా హీరోయిన్లు ఒక్కసారిగా రూటు మార్చి హీరోకు చెల్లి లేదా అక్క పాత్రలు చేయడానికి ఒప్పుకోరు. కానీ భారీ ఆఫర్ వస్తే కాదనలేరు. ఇప్పుడు అలాంటి పరిస్థితి కృతికర్బందా ఎదుర్కొంటోంది. ‘తీన్‌మార్, ఒంగోలుగిత్త’ చిత్రాల్లో నటించిన ఆమెకు తెలుగులో అనుకున్నంత బ్రేక్ రాలేదు. ఈ నేపథ్యంలో ఆమె రామ్‌చరణ్ తాజా చిత్రంలో అతనికి సోదరిగా నటించడానికి ముందుకు వచ్చింది. చాలామంది రామ్‌చరణ్ సోదరిగా చేస్తున్నావు ... వద్దు అని హెచ్చరించారట. కానీ ఆ పాత్ర నాకు బాగా నచ్చింది. అయినా నేనేమీ ఈ సినిమాతో కోల్పోయేదేమీ లేదు.. అంటోంది ఈ అమ్మడు.