డబ్బింగ్ పూర్తయితే సినిమాకు నటీనటులు చేసే వర్క్ దాదాపు కంప్లీట్ అయినట్లే. అందుకే హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు డబ్బింగ్ దగ్గరకు వచ్చేసరికి తమ డబ్బులు పూర్తిగా ఇస్తేనే డబ్బింగ్ చెబుతామని ట్విస్ట్‌లు ఇస్తుంటారు. అలాగే హీరో రామ్ తన రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతను ముప్పుతిప్పలు పెడుతున్నట్లు మీడియా వర్గాల కథనం. వరుస ఫ్లాప్‌ల్లో ఉన్న హీరో కూడా రెమ్యూనరేషన్ విషయంలో ఇలా ఏడిపిస్తే... సినిమాలు ఎలా తీయగలం అని నిర్మాతలు లబోదిబోమంటున్నారు. గతంలోనూ ‘కందిరీగ’ చిత్రం విషయంలో రెమ్యూనరేషన్ విషయం దగ్గర గొడవ జరిగిన విషయం తెలిసిందే. చివరకు ఆ సమస్యను ఫిల్మ్‌చాంబర్ ద్వారా పరిష్కరించుకున్నారు. ‘పండగచేస్కో’ చిత్రానికి రామ్ రెమ్యూనరేషన్‌గా మూడుకోట్లు అడిగాడు. దానికి నిర్మాతలు కూడా ఓకే చెప్పేశారు. ఆల్‌రెడీ రామ్‌కు 2.5కోట్లు ఇచ్చేశారు. ఒక 50లక్షలు మాత్రం పెండింగ్ ఉంది. ఈ మొత్తాన్ని సినిమా విడుదలలోపు ఇస్తామని నిర్మాతలు రామ్‌కు చెప్పారు. అప్పుడు సరే అన్న రామ్ ఇప్పుడు మాత్రం మిగిలిన మొత్తం ఇస్తేనే డబ్బింగ్ చెబుతానని భీష్మించుకొని కూర్చున్నాడట. రామ్ పెద్దనాన్న స్రవంతి రవికిషోర్ దృష్టికి ఈ విషయం వెళ్లినా కూడా ఆయన రామ్‌కు సర్దిచెప్పడం లేదని నిర్మాతలు అంటున్నారు.