ఇటీవల జగపతిబాబు మాట్లాడుతూ... నేను కొంతమంది దగ్గర ఆధ్యాత్మిక విషయాల గురించి చర్చిస్తుంటాను. వాళ్లలో సూపర్‌స్టార్ రజనీకాంత్ ఒకరు. ఆధ్యాత్మిక లోతుల్లోకి వెళ్లిన మహానుభావుడాయన. రజనీతో నేను ‘కథానాయకుడు,లింగ’ చిత్రాలు కలిసి చేశాను. ఆ షూటింగ్ సమయాల్లో మేమిద్దరం ఆధ్యాత్మికత గురించి బాగా చర్చించుకునేవాళ్లం. ఒకరోజు రజనీ గారి దగ్గర ‘మీరెన్నో పుస్తకాలు చదువుతుంటారు కదా! నాకేదైనా మంచి పుస్తకం సూచించండి అనడిగాను. అప్పుడాయన ‘లివింగ్ విత్ ది హిమాలయన్ మాస్టర్స్’ అనే పుస్తకం ఇచ్చారు.ఆ పుస్తకం మొదటిపేజీలో శుభాకాంక్షలు తెలుపుతూ సంతకం చేసి మరీ ఇచ్చారు. హీరోయిన్ అనుష్క కూడా యోగా ఎక్స్‌పర్ట్ అనే విషయం తెలిసిందే. తాను కూడా మంచి పుస్తకాలు చదువుతుంటుంది. ‘లింగ’ షూటింగ్ సమయంలో మేము ఫిలాసఫీ, స్పిర్చువాలిటీ గురంచి మాట్లాడుకుంటున్న సమయంలో తాను నాకు ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి’ (తెలుగులో ‘ఒక యోగి ఆత్మ కథ) అనే పుస్తకాన్ని నాకు ఇచ్చింది... అంటూ చెప్పుకొచ్చాడు జగపతిబాబు.